Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫుల్ బిజీగా కట్టప్ప .. రోజుకు 3 నుంచి 5 లక్షల పారితోషికం

  • తమిళంలో వరుస సినిమాలు
  •  తెలుగులోను వరుస అవకాశాలు
  •  సత్యరాజ్ పారితోషికం 2 కోట్లు  
తమిళంలో రెబెల్ స్టార్ గా సత్యరాజ్ ఒక వెలుగు వెలిగారు. అప్పట్లోనే 5 కోట్ల పారితోషికం అందుకున్న హీరో ఆయన. అలాంటి సత్యరాజ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రాధాన్యత కలిగిన కీలకమైన పాత్రలను అంగీకరిస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవల వచ్చిన 'జెర్సీ' సినిమా ఆయనకి మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో తమిళంతో పాటు తెలుగులోను ఆయనని వెతుక్కుంటూ మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన తన పాత్ర ప్రాధాన్యతను బట్టి మొత్తంగా మాట్లాడుకుంటే 2 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. అదే రోజుల వారీగా అయితే రోజుకి 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. సత్యరాజ్ ఎంత పారితోషికం అడిగినా నిర్మాతలు వెనుకాడరనీ, అందుకు కారణం ఆయన ఎలాంటి పరిస్థితుల్లోను నిర్మాతలను ఇబ్బంది పెట్టరని దర్శకులు చెబుతుంటారు. 'జెర్సీ' సమయంలో నాని కూడా ఇదే మాట చెప్పడం విశేషం
sathyaraj

More Telugu News